Danam Nagender : కాంగ్రెస్ లోకి దారిచూసుకుంటున్న దానం?
Danam Nagender : బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరూ తప్ప అందరూ కాంగ్రెస్ లో చేరిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఈక్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
భట్టి విక్రమార్క మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా వెళ్లారు. వెళ్లడమే కాదు రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ సీఎం అయ్యాక.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతీ రోజూ పండుగ లాగానే ఉందన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత చాలామందికి క్లారిటీ వచ్చింది.
గత రెండు దశాబ్దాలుగా ఓ రేంజ్ లో ఉన్న బీఆర్ఎస్ వైభవం ప్రస్తుతం ఎన్నడూ లేనంతగా దిగజారిపోతోంది. అధికారం లేకుంటే రాజకీయాలు ఎలా ఉంటాయో ఆ పార్టీ అగ్రనేతలకు తెలిసివస్తోంది. ఇక హైదరాబాద్ లో గట్టిగా ఉందనుకున్న పార్టీ..ఇక్కడ కూడా పలుచగా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అధికారం లేకపోతే హైదరాబాద్ లో ఏ చిన్న పని కూడా కాదని తెలుసుకున్న దానం వంటి ఇక్కడి ఎమ్మెల్యేలు.. పెట్టాబేడా సర్దుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే దానంకు బీఆర్ఎస్ తో పెద్దగా అటాచ్ మెంట్ ఏమీ లేదు. గతంలో ఉద్యమకారులను తరిమిన చరిత్ర ఆయనది. అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండేందుకే ఆయన పార్టీలు మారుతారు. ఇప్పుడు కూడా అదే తీరు. గతంలో ఆయన కాంగ్రెస్ నాయకుడే కాబట్టి..ఆయనకు గాంధీభవన్ తలుపులు తెరిచే ఉంటాయి.