YCP MLCs : ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై జగన్ అనర్హత వేటు
YCP MLCs : ఆంధ్రప్రదేశ్ లో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనుండగా, రాష్ట్రంలో ఎన్నికల సీజన్ ప్రారంభమైంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్రమశిక్షణ కారణాలతో ఇద్దరు పార్టీ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, వంశీకృష్ణయాదవ్ పై వైఎస్సార్ కాంగ్రెస్ అనర్హత వేటు వేసింది. ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత ఉత్తర్వులు జారీ చేశారు.
క్రమ శిక్షణా చర్యల కోసం నోటీసులు అందుకున్న ఇద్దరు ఎమ్మెల్సీలు హైకోర్టును ఆశ్రయించగా, మండలి సత్వరమే స్పందించి కోర్టు తీర్పునకు ముందే వారిద్దరిపై అనర్హత వేటు వేసింది. రామచంద్రయ్య ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరగా, వంశీయాదవ్ జనసేనలోకి వెళ్లారు. అసెంబ్లీ స్పీకర్ సీతారాం 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కొద్ది రోజులకే ఈ ఎమ్మెల్సీపై అనర్హత వేటు పడింది.
జగన్ కావాలనే కక్ష పెంచుకొని ఇద్దరిపై అనర్హత వేటు వేశారని ఇది మంచిది కాదని టీడీపీ+జనసేన కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రేపో, మాపో అన్న ఈ తరుణంలో ఇలాంటి డిసిజన్స్ ఏంటని వాదనలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా ఈ అనర్హత వేటు మరోసారి ఏపీలో ప్రకంపనలను రేపింది. టీడీపీ జనసేన కూటమి వైపునకు ఎక్కువ మంది వెళ్తున్నారన్న సంకేతాలను రామ చంద్రయ్య, వంశీ కృష్ణ యాదవ్ బటయ పెట్టగా.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలతోనే వీరు వెళ్లారని మరో వర్గం నమ్ముతోంది.