Vijay Thalapathy : విజయ్ మొదటి రాజకీయ అభిప్రాయం.. CAAను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు..?
Vijay Thalapathy : భారత ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు చేస్తూ గెజిట్ రిలీజ్ చేసింది. 2009 నుంచి చర్చల్లో ఉన్న ఈ బిల్లు 2014లో ఆమోదం పొందింది. దీనిపై తూర్పు ఈశాన్య భారతంలో అల్లర్లు జరుగుతుండడంతో మోడీ సర్కార్ కొన్నాళ్లు దీని అమలును వాయిదా వేసింది. దీనిని 2024 సార్వత్రిక ఎన్నికల వేల గెజిట్ రిలీజ్ చేస్తూ అమల్లోకి తెచ్చింది.
CAAపై సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. అనేక విపక్షాలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వినిపించాయి. తాజాగా ఈ జాబితాలోకి తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత తలపతి విజయ్ కూడా చేరారు. ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, విజయ్ CAA అమలుపై తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పౌరులందరిలో సామాజిక సామరస్యం ఉన్న వాతావరణంలో అటువంటి చట్టం ఆమోదయోగ్యం కాదని నొక్కి చెప్పాడు.
‘తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో సీఏఏ అమలును నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని, తమిళనాడులో చట్టం అమల్లోకి రాకుండా రాజకీయ నాయకులు చూసుకోవడం చాలా ముఖ్యం మరియు మేము పౌరులందరి ప్రయోజనాలను మరియు హక్కులను కాపాడాలి.’ అని విజయ్ అన్నారు. తాను లోక్సభ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం లేదని, రెండేళ్ల తర్వాత తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరుఫున పోటీ చేస్తానని విజయ్ ధృవీకరించారు.
విజయ్ తనపార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) పెట్టినప్పటి నుంచి రాజకీయ పరంగా ఎటువంటి ప్రకటనలు చేయలేదు. ఆయన పార్టీ తరుఫునుంచి చేసిన ఫస్ట్ ప్రకటన ఇదే. ఎక్స్ లో ప్రస్తుతం ఆయన ప్రకటన వైరల్ గా మారింది.