Taapsee Sensational Comments : ఫోన్ చేసి అర్థరాత్రి గెస్ట్ హౌస్ కు రమ్మనేవారు.. తాప్సీ సెన్సేషనల్..!

Taapsee Sensational comments

Taapsee Sensational comments

Taapsee Sensational Comments : కాస్టింగ్ కౌచ్ అనేది సౌత్ నుంచి బాలీవుడ్ దాకా బాగానే వినిపిస్తోంది. ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా సరే దాని జోరు బాగానే వినిపిస్తోంది. చిన్న ఆర్టిస్టుల దగ్గరి నుంచి స్టార్ హీరోయిన్ల దాకా అందరూ దాని బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అవకాశాలు కోల్పోతుంటే.. మరికొందరు మాత్రం కెరీర్ కోల్పోయి ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.

ఇక మీటూ ఉద్యమం తర్వాత ఒక్కొక్కరుగా తమకు జరిగిన అనుభవాలను.. పర్సనల్ విషయాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా తాప్సీ పన్ను వంతు వచ్చినట్టుంది. ఆమె కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలే అని తేలిపోయింది. తాజాగా తాప్సీ మాట్లాడుతూ.. నేను చూసినంత వరకు సౌత్ కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ ఉందని నాకు అర్థం అయింది.

బాలీవుడ్ కు నేను వచ్చిన మొదట్లో చాలానే ఇలాంటివి ఫేస్ చేశారు. చాలామంది నాకు అర్థరాత్రులు ఫోన్ చేసి గెస్ట్ హౌస్ కు రావాలంటూ అసభ్యంగా మాట్లాడేవారు. నేను అలాంటి హీరోయిన్ ను కాదు.. నా ట్యాలెంట్ ను నమ్ముకుని వచ్చాను అని ఎంత చెప్పినా సరే అస్సలు వినిపించుకునేఏ వారు కాదు. ఒక ఇద్దరు హీరోలు అయితే వారితో డేటింగ్ చేయాలంటూ బెదిరించారు.

నేను ఒప్పుకోకపోతే.. నాకు అవకాశాలు రాకుండా చూస్తామని బెదిరించినా సరే నేను మాత్రం వారికి లొంగలేదు. నా స్వతహాగా నా కాళ్ల మీద నేను నిలబడ్డాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మొండి ధైర్యంతో, నా ట్యాలెంట్ మీద ఉన్న నమ్మకంతోనే ముందుకు వెళ్లాను. అందుకే ఈ రోజు ఇక్కడ ఉన్నానని నమ్ముతున్నాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది తాప్సీ.

TAGS