Polygamy : అక్కడ రెండు పెళ్లిళ్లు చేసుకోకుంటే జైలుశిక్ష!
Polygamy : తాత పెళ్లి చేసుకుంటావా? అంటే నాకెవరిస్తారు? అని తాత సమాధానమిస్తాడు తప్ప చేసుకోను అని మాత్రం చెప్పడు. పెళ్లంటే ఎవరికైనా మోజే. కాటికి కాలు చాచే పండుముదుసలి కూడా పెళ్లంటే ఒకే అంటాడు. మన దగ్గర ఒక్కరినే మాత్రమే వివాహం చేసుకోవాలని చట్టం ఉంది. కానీ ప్రపంచంలో వివిధ మతాలు, తెగల్లో బహుభార్యత్వం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా అనే దేశంలో ప్రతీ పౌరుడు ఒక్కరికి మించి పెళ్లిళ్లు చేసుకోవాలనే నిబంధన ఉంది. లేకుంటే ఏకంగా జీవిత ఖైదు చేస్తారట. మహిళలు కూడా ఈ నిబంధనకు ఒప్పుకోవాలట. లేదంటే వారికి జైలుశిక్ష తప్పదట.
అబ్బా..ఇదేదో మన దగ్గర కూడా ఉంటే బాగుండు కదా అని అనుకుంటున్నారా? మన దగ్గర కుదరదు లెండి.. ఎరిత్రియాలో ఈ నిబంధన ఉండడానికి కూడా పెద్ద కారణమే ఉంది. ఆ దేశంలో పురుషుల కంటే స్త్రీల జనాభా చాలా ఎక్కువగా ఉంది. స్త్రీ, పురుష నిష్పత్తిని బ్యాలెన్స్ చేయడానికి పురుషులు రెండు పెళ్లిళ్లు చేసుకోవాలనే నిబంధన తీసుకొచ్చారు. చట్టం ప్రకారం..ఎవరైనా ఒకే భార్యను కలిగి ఉంటే దోషిగా పరిగణిస్తారు.
అయితే ఇక్కడ రెండు పెళ్లిళ్లు తప్పనిసరేమి కాదని కూడా కొన్ని వాదనలున్నాయి. రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం నేరం మాత్రం కాదంటున్నారు. ఈ విషయంపై ప్రజల ఇష్టాయిస్టాలకే వదలేశారని కూడా అంటారు. అయితే చాలా మంది రెండు పెళ్లిళ్లకే మొగ్గుచూపుతున్నారని తెలుస్తోంది.