Maha Shivratri : మహా శివరాత్రి నుంచి ఈ రాశుల వారికి రాజ, ధన యోగాలు..
Maha Shivratri : 2024, మార్చి 8వ తేదీ మహా శివరాత్రి. అదే రోజు శుక్రుడు మకర రాశి నుంచి కుంభ రాశిలోకి, బుధుడు కుంభ నుంచి మీన రాశిలోకి మారుతారు. సాధారణంగా గ్రహాల రాశుల మార్పునకు సంబంధించి ప్రభావం అన్ని రాశుల మీద ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ప్రధానంగా 6 రాశులకు ధన, రాజ యోగం ఉందట.
ఈ ఆరు రాశుల వారే కాకుండా మిగిలిన రాశుల వారికి ఈ గ్రహాల మార్పుతో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ 2 శుభ గ్రహాల రాశుల మార్పు వల్ల మేషం, మిథునం, వృషభం, తుల, మకరం, కుంభ రాశుల వారికి మార్చి 31వ తేదీ వరకు శుభప్రదంగా ఉంటుంది.
మేషం (Aries)
ఈ రాశి వారికి లాభ స్థానంలోకి శుక్రుడు వస్తాడు. దీని వల్ల అన్నీ కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రావలసిన బకాయిలు, బాకీలు చేతికి అందుతాయి. సంపద పెరుగుతుంది. బుధుడు వ్యయ స్థానంలో రాజయోగమిస్తాడు. ఫలితంగా, వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు జరుగుతాయి.
వృషభం(Taurus)
ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈయన దశమంలోకి ప్రవేశించడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగం పడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరకడంతో పాటు ఉద్యోగులు ప్రమోషన్ లాంటివి పొందుతారు. బుధుడు లాభ స్థానంలోకి మారడం వల్ల ధనానికి సంబంధించి శుభ వార్తలు వింటారు. జీత భత్యాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. మనసులో కోరికలు నెరవేరడంతో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి.
మిథునం (Gemini)
ఈ రాశికి అధిపతి బుధుడు. ఈయన దశమ స్థానంలోకి ప్రవేశించడం, ఈ రాశికి శుభుడైన శుక్రుడు భాగ్య స్థానంలోకి మారడం వ్యాపార, వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఆర్థికంగా తలపెట్టే ఏ ప్రయత్నమైనా విజయవంతం అవుతుంది. జీత భత్యాలు, రాబడి, ఆస్తులు వగైరాల కారణంగా సంపద పెరుగుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి అవుతుంది.
తుల (Libra)
ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈయన పంచమ స్థానంలో ప్రవేశించడం, ఆరో స్థానంలో బుధుడు సంచరిస్తుండడం వల్ల రాజయోగంతో పాటు లక్ష్మీ యోగం కలుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగంలో జీత భత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్న వారికి ఆర్థికంగా లాభం చేకూరుతుంది.
మకరం (Capricorn)
ఈ రాశి వారికి రెండు గ్రహాల మార్పుతో అదృష్టం పట్టే అవకాశం ఉంది. వీరు రాజయోగాన్ని అనుభవిస్తారు. అనుకోని తీరు నుంచి ధనయోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా సానుకూల పరిణామాలు ఉంటాయి. జీతభత్యాలు కూడా ఊహించని విధంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులకు, జీవిత భాగస్వామికి కూడా ఆర్థికంగా అదృష్ట యోగం పడుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కుంభం (Aquarius)
ఈ రాశి వారికి అపార ధన లాభం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. లాభదాయక పరిచయాలు కలుగుతాయి. ఆస్తి సంబంధ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వల్ల ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం విశ్వాసాలు, నెట్ లో దొరికి సమాచారం మేరకు అందిస్తున్నాం.. ఇది కచ్చితంగా చెప్పేందుకు శాస్త్రీయ లేదు.