CM Revanth-Visakha: ఈనెల 11న విశాఖకు వెళ్లను సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 11వ తేదీన విశాఖపట్నం వెళ్ళనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. ఇదే సభలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, ఇతర పార్టీ సీనియర్ నేతలు పాల్గొంటారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటిస్తారు. గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగు లు ఆందోళనకు గురవుతున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే మా బ్రతుకులో రోడ్డున పడతాయని అక్కడ పనిచేసే కార్మికులు ఆందోళన చేపట్టారు. వారు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది.