Sharing Room : వేశ్యతో రూమ్ షేరింగ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే…
Sharing Room : హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. రూం రెంట్ ఎక్కువ కావడంతో, షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్ లో ఓ ప్రకటన ఇచ్చాడు. తన రూంలో ఉండేందుకు ఎవరైనా షేరింగ్ చేసుకోవచ్చని అందులో పోస్ట్ చేశాడు. అయితే ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగితో ఉండేందుకు ఒక అమ్మాయి ఒప్పుకుంది. ఇంకేం అతడు ఒప్పుకున్నాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ అతడికి ఎదురైంది.
సాప్ట్ వేర్ ఉద్యోగి సీ కిరణ్ కుమార్ వెంగళరావు నగర్ లోని శ్రీకృష్ణానగర్ లో సంవత్సరం క్రితం ఓ గదిలో అద్దెకు దిగాడు. అయితే రూమ్ షేరింగ్ కావాలంటే తనను సంప్రదించాలని ప్రకటన ఇచ్చాడు. ఓ మహిళ ఇందుకు ఒప్పుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు కూకట్ పల్లికి మారారు. కొన్ని రోజులకు ఆమె తాను వేశ్యనని చెప్పడంతో, ఆమెను గది ఖాళీ చేయమని కోరాడు. ఆమె నిరాకరించింది. తనతో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడుతానని హెచ్చరించింది. ఇక ఇద్దరి మధ్య తగువులాట జరిగింది. దీంతో కిరణ్ కుమార్ పై సదరు మహిళ లైంగిక దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత అతడి నుంచి రూ. 4.7 లక్షలు పరిహారంగా తీసుకుంది. అయితే సదరు మహిళ సోషల్ మీడియాలో కిరణ్ తో ఉన్న ఫొటోలను వైరల్ చేసింది. కిరణ్ సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో, వారు వాటిని తొలగించారు. అయితే ఈనెల 13న రాత్రి ఇద్దరు వ్యక్తులతో కలిసి, సదరు మహిళ కిరణ్ కుమార్ పై దాడి చేసింది. దీంతో బుధవారం రాత్రి మరోసారి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సహజీవనం పేరిట తనను మహిళ మోసం చేసిందని, మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. ఇద్దరితో మాట్లాడుతున్నారు.