Ration Card : రేషన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్.. ఆ కార్డులు రద్దు..!
Ration Card : తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తు న్నారు. ఇలాంటి తరుణంలో రేషన్ కార్డులో కొంత మంది పేర్లు తొలగించే అవకాశం ఉంది. అలాగే కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే అవకాశం ఉంది బోగస్ రేషన్ కార్డులు ఏరివేయడానికి ప్రభుత్వం రేషన్ కార్డు ఇ కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. తెలంగాణలో గత ఆరు నెలలుగా రేషన్ కార్డుల ఇ కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డుదారులు దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ వద్దకు వెళ్లి ఇకేవైసీ చేయించుకున్నారు.
డీలర్ వద్ద కు వెళ్లి రేషన్ కార్డు నంబర్ తోపాటు ఆధార్ నంబర్ చెప్పాలి. ఆ తర్వాత వేలిముద్ర ఇవ్వాలి. దీంతో రేషన్ కార్డు ఇ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. ఫిబ్రవరి 27 వరకు తెలంగాణలో 75 శాతం రేషకార్డుల్లో ఇ కేవైసీ ప్రక్రియ పూర్తయి. నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా రేషన్ కార్డు ఇ కేవైసీ చేసుకోవడానికి ఫిబ్రవరి 29తో గడువు ముగిసింది. దీంతో రేషన్ కార్డు ఇ కేవైసీ చేసుకోలేని వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి తొలగించనున్నారు.
కొన్ని రేషన్ కార్డులకు సంబంధించి పూర్తిగా ఈ కేవైసీ చేసుకోలేదు. వీటిని పూర్తిగా రద్దు చేసే అవ కాశం ఉంది. ఉదాహరణకు ఒక రేషన్ కార్డులు ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఇందులో ముగ్గురు సభ్యులు ఇ కేవైసీ చేసుకున్నారు. మిగతా వారు చేసుకోలేదు. దీంతో ఆ ఇద్దరు పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగించే అవకాశం ఉంది. అలాగే ఓ రేషన్ కార్డులు అదే ఐదుగురు సభ్యులు ఉన్నారను కుంటే.. ఏ ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోకుంటే.. ఆ రేషన్ కార్డు రద్దు చేసే అవకాశం ఉంది.
తెలంగాణలో రేషన్ కార్డుల ఇ కేవైసీ ప్రక్రియ పూర్తయన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. ప్రజాపాలన దరఖాస్తుల సందర్భంగా చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేశారు. వీరంతా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పారు.