BJP : పి.గన్నవరం సీటు కావాలని బీజేపీ అడుగుతోందా..?

P Gannavaram

P Gannavaram-BJP

P Gannavaram-BJP : గతంలో పి.గన్నవరంకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మహాసేన రాజేశ్ రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తనపై విద్వేషపూరిత ప్రచారం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల టార్గెట్ వైఖరి కారణంగానే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు.

ఈ నియోజకవర్గంపై బీజేపీ కన్నేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యే టికెట్ కోసం ఆసక్తికరమైన ఆశావహులు ఉన్నారు. ఒకవేళ తెలుగుదేశం, జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరితే ఈ పి.గన్నవరం అసెంబ్లీ టికెట్ కోసం కాషాయ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది.

1999లో బీజేపీ ఇక్కడి నుంచి విజయం సాధించింది. పి.గన్నవరంలో విజయం ఆ పార్టీకి కొత్తేమీ కాదు. కాబట్టి ఇక్కడ కాషాయ పార్టీకి కమల దళం ఉంది. టీడీపీ+జనసేనతో పొత్తు కుదిరితే బీజేపీకి కొన్ని ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని, అందులో పి.గన్నవరం కూడా ఒకటి కావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహాసేన రాజేశ్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఎమ్మెల్యే టికెట్ ను బీజేపీకి ఇచ్చేందుకు బహూషా టీడీపీ-జనసేనకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అయితే ఇక్కడ జరగాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే బీజేపీ ముందుగా కూటమిలో చేరాలి, ఆ తర్వాతే సీట్ల పంపకం అంశం చర్చకు వస్తుంది.

పి.గన్నవరంలో ఒక సీటు కమలం ఖాతాలో పడుతుందని ఇప్పిటికే టాక్ ఉంది. ఏపీలో బీజేపీ పెద్దగా సత్తా చూపించడం లేదు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఆ పార్టీకి అభిమానులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో ఉన్నారు. వీరితో పాటు, పొత్తుతో ఈ సారి కొన్ని సీట్లను కైవసం చేసుకోవచ్చని పార్టీ భావిస్తోంది.

TAGS