Mangalavaram Movie Review : ”మంగళవారం” రివ్యూ.. ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే..

Mangalavaram Movie Review

Mangalavaram Movie Review

Mangalavaram Movie Review :

నటీనటులు :

పాయల్ రాజ్ పుత్,
అజయ్ ఘోష్
రవీంద్ర విజయ్
చైతన్య కృష్ణ
నందిత శ్వేతా

డైరెక్టర్ : అజయ్ భూపతి

సంగీతం : అజనీష్ లోకనాథ్

నిర్మాతలు : సురేష్ వర్మ, అజయ్ భూపతి, స్వాతి రెడ్డి,

తెలుగు ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్టులో అజయ్ భూపతి కూడా ఉంటారు.. ఈయన ఆర్ఎక్స్100 అనే సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు.. ఒకే ఒక్క సినిమాతో ఈ డైరెక్టర్ గురించి అంత మాట్లాడుకునేలా చేసాడు.. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, కార్తికేయ హీరో హీరోయిన్లుగా నటించగా ఈ ముగ్గురి కేరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ ముగ్గురికి కూడా ఇండస్ట్రీలో ఆ సినిమా తర్వాత మరో హిట్ అనేది దక్కలేదు..

మరి ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ పాయల్ రాజ్ పుత్ నటించింది. ఈ ఇద్దరు కలిసి తాజాగా ”మంగళవారం” అనే హారర్ కాన్సెప్ట్ తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని డిసైడ్ అయ్యి పట్టుదలతో ఈ సినిమా తీశారు.. పాయల్ రాజ్ పుత్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ, నందిత శ్వేతా ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ రోజు నవంబర్ 17న గ్రాండ్ గా సౌత్ భాషల్లో రిలీజ్ చేసారు. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం..

కథ :

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మహాలక్ష్మీపురం అనే గ్రామ ఉంది. ఆ గ్రామం నుండి అర్ధరాత్రి పెద్ద పెద్ద భయానక శబ్దాలు వస్తుంటాయి.. ఒక లేడీ నెత్తి మీద బోనాలు ఎత్తుకుని ఊరంతా తిరుగుతూ ఉంటుంది.. మరో వైపు శైలజ ( పాయల్), రవి (చైల్డ్ ఆర్టిస్ట్) స్నేహితులు.. శైలజ అమ్మ చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటాడు.. దీంతో శైలజ వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటుంది.. అయితే రవి, వాళ్ళ నాన్న మంటల్లో చనిపోవడంతో శైలజ ఒక్కసారిగా ఒంటరిగా అయిపోతుంది..

ఇక పదేళ్ల తర్వాత.. ఆ ఊరిలో మంగళవారం రోజు ఒక గోడపై ఒక జంట అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు రాస్తారు.. ఆ జంట ఊరి అవతల బావి వద్ద ఆత్మహత్య చేసుకుని చనిపోతారు.. మరో మంగళవారం కూడా అలానే గోడపై రాయగా ఆ జంట కూడా ఆత్మహత్య చేసుకుంటారు.. అయితే వీరికి పోస్టు మార్టం చేయకూడదని ఊరి జమీందారు (చైతన్య కృష్ణ) ఆదేశిస్తాడు..

కానీ వరుస జంట ఆత్మహత్యల నేపథ్యంలో ఎస్ఐ మీనా (నందిత శ్వేతా) రంగంలోకి దిగుతుంది.. ఈ జంటలు ఆత్మహత్య చేసుకోలేదు అని ఇది హత్యలే అని నిర్దారణకు వస్తుంది. చనిపోయిన వారికీ పోస్టుమార్టం చేయిస్తుంది. ఇదే సమయంలో ఆ ఊరిలో డాక్టర్ విశ్వనాథం అనే అతడు ఊరి చివర బావి వద్ద దెయ్యం రూపంలో శైలజ తిరుగుతున్నట్టు చెబుతాడు.. మంగళవారం రోజునే గోడలపై అక్రమ సంబంధాల పేర్లు రాస్తూ వారిని చంపేస్తున్నారని వారిని పట్టుకునేందుకు ఊరి జనం కాపలా కాస్తారు.. మరి ఊరి జనం చివరికి వారిని పెట్టుకున్నారా? గోడలపై పేర్లు రాస్తుంది ఎవరు? ఎందుకు జంటలను చంపుతున్నారు? శైలజ ఏమైంది? అనేది మిగిలిన కథ..

విశ్లేషణ :

మంగళవారం అనే సినిమాను అంతా హర్రర్ త్రిల్లర్ గానే చూసారు. కానీ అజయ్ భూపతి ఈ సినిమాను మంచి సందేశాత్మకంగా తీసాడు.. గ్రామా దేవత, థ్రిల్లర్ ఎలిమెంట్ల బ్యాక్ డ్రాప్ లో అక్రమ సంబంధాల కథను చెప్పాడు డైరెక్టర్.. అంతేకాదు ప్రేక్షకులు ఊహించని ఎన్నో ట్విస్టులు చూపించాడు.. ఒక ఛేలెంజింగ్ కథను అజయ్ భూపతి మలిచిన తీరు హైలెట్ అనే చెప్పాలి.. కథే ప్రధానంగా నడిచే సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది. అజనీష్ సంగీతం, నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా తోడయ్యి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే విధంగానే ఉంది.

నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. శైలజ పాత్రకు పాయల్ పూర్తి న్యాయం చేసింది.. ఈ భామ ఇలాంటి రోల్ ను కూడా పోషిస్తుంది అని ప్రేక్షకులు అస్సలు అనుకోలేదు.. ఎంత పెద్ద నటి అయినా ఇలాంటి రోల్స్ చేయడం సాహసం అనే చెప్పాలి.. తన అద్భుతమైన నటనతో జీవించింది అనే చెప్పాలి.. ఇక అజయ్ ఘోష్ తన పాత్రను చక్కగా చేసాడు.. జమీందారుగా చైతన్య కృష్ణ ఏజ్ కు మించిన రోల్ అయినా బాగా చేసాడు. నందిత శ్వేతా ఎస్ఐ గా అద్భుతంగా నటించింది.. మిగిలిన పాత్రలు కూడా బాగా చేసి సినిమాకు ప్లస్ అయ్యారు.

టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అజనీష్ సంగీతం.. ఈయన మ్యూజిక్ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలిచింది.. కెమెరా వర్క్, ఎడిటింగ్ కూడా బాగున్నాయి.. ఇక డైరెక్టర్ అజయ్ భూపతి సినిమాను అద్భుతంగా తెరకెక్కించి వంకలు పెట్టడానికి కూడా లేకుండా చేసాడు..

ఫైనల్ గా మంగళవారం మూవీ త్రిల్లింగ్ గా ఆకట్టుకునేలా ఉంటుంది..

రేటింగ్ : 3/5

TAGS