Half-day Schools : ఒంటి పూటబడులపై ప్రభుత్వ నిర్ణయం..
Half-day Schools : తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఒంటి పూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15 తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, స్కూల్లకు ఏప్రిల్ 23 వరకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఒంటి పూట బడులు కొనసాగుతాయి.
అటు టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లలో మాత్రం మధ్యాహ్నం క్లాసులు నిర్వహిస్తారు. ఎండల తీవ్ర త అధికంగా ఉన్న నేపథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహిం చాలని అధికారులను ఆదేశించింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం ఎండలు మండిపో తున్నాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో అధి కంగా ఎండలు ఉంటాయి. కానీ ఈ సంవత్స రం ఫిబ్రవరి చివరి నుంచి ఎండల తీవ్రత పెరిగిపో యింది.