Nayan-Vignesh : విఘ్నేశ్ శివన్ ను అన్ ఫాలో చేసిన నయన్..ఎందుకు చేసిందబ్బా?
Nayan-Vignesh : నయనతార దక్షిణాది లేడి సూపర్ స్టార్ గా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోలకు మించి రెమ్యూనరేషన్ తీసుకుంటూ టాప్ హీరోయిన్ గా ఉన్నారు. లేడీ ఒరియంటేడ్ మూవీలే కాక ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన రొమాన్స్ చేస్తోంది నయన్. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డుచెప్పలేదు నయన్. డ్యూయెట్లు పాడడమే కాదు యాక్షన్ సీన్లను అద్భుతంగా చేయగలదు. కాబట్టే ఆమె నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.
నయనతార ఇటీవలే ఇన్ స్టాలోకి అడుగుపెట్టారు. వారి పిల్లలను చూపిస్తూ తొలి పోస్ట్ పెట్టగా దానికి లక్షల మంది లైక్ లు, కామెంట్లు పెట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఆమెకు ఇన్ స్టాలో 78 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే తాజాగా నయన్ తన భర్త విఘ్నేశ్ శివన్ ను ఇన్ స్టాలో అన్ ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘పొరపాటున ఇలా చేశారు’ అని ఒకరు పోస్ట్ పెట్టగా.. ‘సాంకేతిక లోపం వల్ల విఘ్నేశ్ పేరు కనిపించడం లేదంతే’ అని మరొకరు అన్నారు. సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ పెద్దల అంగీకారంతో 2022 జూన్ లో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నయనతార ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఇందులో కుముద పాత్రలో నయన్ కనిపించనున్నారు. దీనితో పాటు మరో తమిళ సినిమాలోనూ నటిస్తున్నారు.