UBlood App Ambassador : ‘యూ బ్లడ్’ అంబాసిడర్ ను కలిసిన పాతూరి..

UBlood App Ambassador

UBlood App Ambassador Sonu Sood and Pathuri Nagabhusanam

UBlood App Ambassador Sonu Sood : ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి, శస్త్ర చికిత్సలో రక్తం కావాల్సిన వారికి అండగా ఉంటోంది ‘యూ బ్లడ్’ యాప్. యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారి ఆలోచనలతో పురుడు పోసుకున్న ఈ యాప్ ఎంతో మంది ప్రాణాలను కాపాడింది. మరెందరినో చావు నుంచి రక్షించింది. ఎక్కడెక్కడ, ఎవరెవరికి రక్తం అవసరం అవుతుందో వారి వారికి సరైన సమయంలో అందజేస్తుంది. నేరుగా నియర్ బై డోనార్ ను సదరు హాస్పిటల్ కు పంపుతుంది. దీంతో లైవ్ బ్లడ్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ సేవలతో గ్రహీతలతో పాటు వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ యాప్ కోసం యూబ్లడ్ ఫౌండర్ జై, డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు చాలా శ్రమించారు. యాప్ ను రూపొందించడమే కాకుండా ప్రచార బాధ్యతలు, తదితరాలను దగ్గరుండి చూసుకున్నారు. ఇది ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితం కావద్దనే దీన్ని యాప్ రూపంలో తీసుకువచ్చారు ఫౌండర్ జగదీష్ బాబు గారు. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ ఉన్న ప్రతీ చోట యూ బ్లడ్ సేవలు అందుబాటులో ఉంటాయి. యాప్ ఇన్ స్టాల్ చేసుకొని సైన్ ఇన్ అయి. మీరు డోనర్ గా నమోదైతే చాలు మీ బ్లడ్ ఎవరికి కావాలో వారికి ఇవ్వవచ్చు. మీకు, మీ కుటుంబ సభ్యులకు బ్లడ్ కావాలంటే కూడా డోనార్ ను కనుగొనవచ్చు.

ఈ కాన్సెప్ట్ నచ్చిన సోనూసూద్ యూ బ్లడ్ కు అంబాసిడర్ వ్యవహరిస్తున్నారు. ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న ఇలాంటి యాప్ లతో సమాజానికి మరింత మేలు కలుగుతుందని ఆయన చాలా సందర్భాల్లో యూ బ్లడ్ గురించి మాట్లాడారు. ఫౌండర్ కు ఇలాంటి ఆలోచన రావడాన్ని ఆయన ప్రశసించారు కూడా. యూ బ్లడ్ అంబాసిడర్ సోనూసూద్ ను హైదరాబాద్ విమానాశ్రయంలో యూ బ్లడ్ కన్వీనర్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరి నాగభూషణం గారు శనివారం కలిశారు. పలు రాజకీయ విషయాల గురించి వారు కాసేపు ముచ్చటించారు.

TAGS