BJP First List : నేడు బీజేపీ తొలి జాబితా.. సగం సీట్లు ఖరారు?
BJP First List : దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ.. దక్షిణాదిలో పాగా వేయడానికి వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్నా, నిజానికి అధికారంలోకి వచ్చే అవకాశాన్ని జారవిడుచుకుందనే విమర్శలున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా మోదీ వేవ్ తో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ భారీ ప్లాన్స్ వేస్తోంది. అందులో భాగంగా ఇవాళ తొలి జాబితా రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది.
గురువారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ అయ్యింది. 9 రాష్ట్రాల్లో అభ్యర్థుల పేర్లతో జాబితా రెడీ చేసింది. వీటిలో తెలంగాణ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, గుజరాత్, గోవా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ కె. లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి వంటి వారు ఢిల్లీకి వెళ్లి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీని కలిశారు.
తొలి జాబితాలో 125 సీట్లకు పైగా అభ్యర్థులను ఖరారు చేశారని తెలిసింది. మార్చి 10లోగా 300 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ విషయంలో ఇంత జోరుగా లేదు. అందువల్ల త్వరగా అభ్యర్థులను ప్రకటించి, త్వరగా ప్రచారాన్ని ప్రారంభించాలని బీజేపీ యోచిస్తోంది. గత 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే చేసి, బీజేపీ మూడు రాష్ట్రాలను గెలుచుకుంది.
ఈసారి సిట్టింగ్ లకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలిసింది. 2019లో గెలిచిన వారిలో మూడో వంతు ఎంపీలకు ఈసారి టికెట్లు ఇవ్వరని తెలిసింది. వీరిలో వయసు 70ఏండ్లు దాటినవారు, 3 సార్లు పోటీ చేసిన వారు ఉంటారని, మూడు సార్లు పోటీ చేసిన వారు ఉంటారని తెలుస్తోంది. వారి బదులు యువతకు చాన్స్ ఇస్తారని సమాచారం.
తెలంగాణలో ప్రస్తుతం 4 స్థానాల దాక అభ్యర్థులను ఖరారు చేశారని తెలుస్తోంది. వారిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇవాళ తొలి జాబితా రిలీజ్ చేస్తే, తెలంగాణలో రాజకీయ వేడి మరింత అవకాశం ఉంటుంది.