BJP Alliance : కూటమితో పొత్తుకు బీజేపీ.. కొలిక్కి వచ్చిన చర్చలు.. నేడో రేపో ప్రకటన..

BJP Alliance

BJP Alliance

BJP Alliance : టీడీపీ+జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ పొత్తు అంశంపై క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీకి కేటాయించే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లపై తేల్చాలని కోరింది. 10 పార్లమెంట్, 6 అసెంబ్లీ సీట్ల కావాలని తొలుత డిమాండ్ చేసింది. దీంతో ఎవరికి వారు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో సంప్రదించడంతో జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ కూడా ఉండాలని ఢిల్లీ పెద్దలను కోరడంతో కలిసేందుకు బీజేపీ సిద్ధమైనట్లు సమాచారం.

అయితే, బీజేపీ తొలిత డిమాండ్ చేసినట్లుగా కాకుండా టీడీపీ 5 అసెంబ్లీ స్థానాలు 3 ఎంపీ స్థానాలు ఇస్తామని టీడీపీ చెప్పడంతో అందుకు అంగీకారం తెలిపినట్టుగా సమాచారం. దీనికి బీజేపీ పెద్దలు కూడా సమ్మతించారట. ఇప్పటికే జనసేన+టీడీపీ ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో 99 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు బాబు.

అయితే, మిగిలిన స్థానాలను రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. అందులో జనసేనతో పాటు బీజేపీకి కేటాయిస్తారని తెలుస్తోంది. బీజేపీ కూడా కలిసి వస్తుందని తెలియడంతో దీనిపై అఫీషియల్ ప్రకటన రెండు, మూడు రోజుల్లో చేస్తారని తెలుస్తోంది. 2014 టీడీపీ+జనసేన+బీజేపీ బరిలో దిగినప్పుడు అనుకూల ఫలితాలు వచ్చాయి. 2019లో మాత్రం విడివిడిగా పోటీ చేశారు. దీంతో వ్యతిరేఖ ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు 2014 ఎన్నికల్లో మాదిరిగానే 3 పార్టీలు కలిసి వెళ్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మూడు పార్టీల అగ్రశ్రేణి నేతలు జనసేనకు సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ తలదూర్చినట్లు తెలుస్తోంది. జనసేనకు మరి కొన్ని సీట్లు ఇవ్వాలని బీజేపీ అగ్రశ్రేణి నేతలు టీడీపీపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తమ పార్టీకి సముచిత స్థానం కల్పించడం క్యాడర్ డిసప్పాయింట్ కాకుండా బీజేపీ పెద్దలు బాబుకు సూచించినట్లు తెలుస్తోంది.

TAGS