Ration Cards : రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. ఇవాళే లాస్ట్!
Ration Cards : రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ దేశ వ్యాప్తంగా చాలా రోజుల నుంచి కొనసాగుతోంది. కార్డులో ఉన్న సభ్యులు కేంద్రానికి వెళ్లి వేలిముద్రలు సమర్పించి డీలర్ల వద్ద నమోదు చేసి ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాతనే కార్డు లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందుతాయి. నేటితో ఈ కేవైసీ గడువు ముగిసిపోతుంది.
ఈ కేవైసీ చేసుకుంటేనే సరుకులు వస్తాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెప్తూనే ఉన్నాయి. అయినా కూడా కొందరు చేసుకోవడం లేదు. గతంలో ఒకటి రెండు సార్లు గడువును కూడా పొడిగించారు. కానీ ఈ సారి మాత్రం పొడిగించేది లేదని తేల్చి చెప్తున్నారు. ఇంకా ఈ కేవైసీ చేసుకోని వారు సమీపంలోని రేషన్ షాప్ వద్దకు వెళ్లి.. పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు
రేషన్ కార్డుల ఈ కేవైసీ ప్రక్రియ గడువు జనవరి 31. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో కార్డులను ఆధార్ తో అనుసంధానించే గడువు ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించింది కేంద్రం.
తెలంగాణలో రేషన్ ఈ కేవైసీ 85 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివరి కల్లా 100 శాతం పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, ఆ లక్ష్యం ఇప్పటి వరకు నెరవేరినట్లు కనిపించడం లేదు. చాలా మంది ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంది.
కార్డులకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించిన కేంద్రం అడ్డుకట్ట వేసేందుకు ఈ కేవైసీని తెచ్చింది. లబ్ధిదారులు ఒక చోటు నుంచి మరో చోటుకు వలసలు వెళ్లడం. మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డులో ఉండడం, వంటి వాటిని ప్రక్షాళన చేస్తోంది.
కార్డులో పేర్లున్న వారు.. తమ ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ వివరాలివ్వాలి. లేదంటే వారి పేర్లు కార్డులో నుంచి తొలగిస్తారు. గడువు చివరికి రావడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. చాలా చోట్ల సాంకేతిక లోపంతో అప్డేట్ కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.
రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువు ఫిబ్రవరి నెలాఖరు వరకు పెంచింది. ఈ కేవైసీలో నమోదు చేసుకున్న కుటుంబ సభ్యుల వివరాలే కార్డులో ఉంటాయి.. వారికి మాత్రమే రేషన్ సరుకులు వస్తాయి. కానీ ఇంకా చాలా మంది చేసుకోలేదని తెలుస్తోంది.