CM Revanth : సర్కారు కొలువులపై బిగ్ అప్ డేట్.. తీపి కబురు చెప్పిన రేవంత్ ప్రభుత్వం

Mega DSC-2024

CM Revanth

CM Revanth : నీళ్లు, నిధులు, నియామకాలు దక్కాలని ఆవిర్భవించిన తెలంగాణ పదేళ్ల నుంచి నియామకాలు లేవు. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొలువులు ఎక్కడా? అంటూ ప్రత్యర్థి పార్టీలు సైతం పదేళ్లుగా గళం విప్పుతూనే ఉన్నాయి. అయినా పట్టించుకోని బీఆర్ఎస్ ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ముగిసిన తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నియామకాల విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది.

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా పదేళ్లుగా గోస పడుతున్నారని గ్రహించిన రేవంత్ ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే తీపి కబురు చెప్పింది. మేగా డీఎస్సీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 11,062 పోస్టులను దీని ద్వారా భర్తీ చేస్తామని చెప్పింది. అందులో ఎస్‌జీటీలు 6508, స్కూల్ అసిస్టెంట్లు 2629, లాంగ్వేజ్ పండిట్ 727, పీఈటీలు 182, స్పెషల్ కేటగిరీ స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్‌జీటీ 796 ఉన్నాయి.

అభ్యర్థులు మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ చేపట్టనున్నారు. దరఖాస్తు ఫీజు ఒక్కో పోస్ట్ కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. https://schooledu.telangana.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సూచిస్తున్నారు. అయితే గతంలో నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని శాఖ తెలిపింది.

ప్రభుత్వం ఈ సారి మరో తీపి కబురు కూడా తెలిపింది. ఆన్ లైన్ మోడ్ లో డీఎస్సీ నిర్వహించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థుల వయో పరిమితిని 18 నుంచి 46 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉద్యోగులకు ఐదేళ్ల ఏజ్ రిలాక్స్ ఇచ్చారు. దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడేళ్ల పరిమితిని విధించారు. దీంతో ఇన్నాళ్లు పోటీ పరీక్షలకు దూరమైన వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TAGS