Deepika Padukone : తల్లి కాబోతున్న దీపికా పడుకొణె.. డెలివరీ టైం కూడా చెప్పేశారు!
Deepika Padukone : దీపికా పడుకొణె.. బాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్. దీపికా అందాలకు ఫిదా కాని అభిమానులు ఎవరూ ఉండరు. హాలీవుడ్ హీరోయిన్ లాగా ఒంపుసొంపులు ఉన్న దీపికా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడదు. తన అందాలతో యూత్ ను కవ్విస్తూ ఉంటుంది. రణవీర్ ను పెళ్లి చేసుకుని లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అందరూ పిల్లలను కంటున్నారు..మరి దీపికా ఎప్పుడు తల్లి అవుతుందో అని అందరూ ఎదురుచూశారు. అయితే తాజాగా ఆ రోజు మరెంతో దూరం లేదని సమాచారం.
తనకు పిల్లలను కనాలని ఉందని రీసెంట్ గా దీపికా కామెంట్స్ చేసింది. ఇంతలోనే దీపికా తల్లి కాబోతోందని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పినట్టు ది వీక్ రిపోర్ట్ వెల్లడించింది. ఆమె ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ రెండో ట్రైమెస్టర్ లో ఉందని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం విశేషం.
తనకు రణవీర్ కు పిల్లలంటే చాలా ఇష్టమని, తాము కూడా ఓ ఫ్యామిలీని మొదలుపెట్టే రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో దీపికా చెప్పుకొచ్చింది. అయితే ఇంతలోనే ఆమె తల్లి కాబోతోందని వార్తలు రావడం గమనార్హం. ఈమధ్యే బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో ఆమె ప్రజెంటర్ గా పార్టిసిపేట్ చేసింది. అయితే ఈ రిపోర్ట్ చెప్పినట్టు ఆమె రెండో ట్రైమెస్టర్ లో ఉన్నట్టు కనిపించలేదు.
అలాగే దీపికా వచ్చే వర్షాకాలంలోనే బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ది వీక్ రిపోర్ట్ తెలిపింది. రణవీర్ సింగ్, దీపికా 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ల తర్వాత పెళ్లి పీటలెక్కిన సెలబ్రిటీ కపుల్ రణబీర్, ఆలియా ఇప్పటికే పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. దీంతో మీరెప్పుడూ గుడ్ న్యూస్ చెబుతారని దీపికా, రణవీర్ లకు ప్రశ్నలు సంధించేవారు. మరి ఇప్పుడు దీపికా తల్లి కాబోతుందనే విషయంతో ఆ ప్రశ్నలకు చెక్ పడ్డట్టే అని చెప్పవచ్చు.