Arjun Vs Shobha Shetty : శోభా శెట్టిని అంత మాట అన్న అర్జున్.. నిజమే అంటున్న నెటిజెన్స్.. ఏమన్నాడంటే?
Arjun Vs Shobha Shetty : బిగ్ బాస్ షో ఇప్పుడు మంచి రసవత్తరంగా సాగుతుంది.. సీజన్ 7 టైటిల్ పోరు కోసం హౌస్ లో ఉన్నవారంతా హోరాహోరీగా పోటీ మొదలెట్టారు.. 14 మందితో మొదలైన బిగ్ బాస్ షో 10 వారాలు ముగించుకుంది.. మధ్యలో ఐదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు..
మొత్తంగా 10 వారాల్లో 10 మంది హౌస్ నుండి బయటకు వచ్చారు.. ఇప్పుడు హౌస్ లో 10 మంది సభ్యులు ఉండగా వారి మధ్య ఆట రసవత్తరంగా సాగుతుంది.. టాప్ 5 కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది. ఇక ఈ వారం నామినేషన్స్ గరంగరంగా సాగుతున్నాయి..
ఈసారి నామినేషన్స్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్ మినహా మిగిలిన వారంతా నామినేషన్స్ లో ఉన్నారు.. ప్రస్తుతం హౌస్ లో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. టాప్ 10 లో ఎవరెవరు ఉంటారు అనే దానిపై హౌస్ మేట్స్ మధ్య ఓటింగ్ జరిపాడు.. బుధవారం ఎపిసోడ్ లో ఏవిక్షన్ పాస్ కోసం పోటీ పెట్టగ ఇందులో అర్జున్ విజేతగా నిలిచాడు.
దీంతో అర్జున్ టాప్ 5 లోకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది.. అయితే నిన్న జరిగిన ర్యాంకింగ్ ప్రక్రియ సమయంలో అర్జున్, శోభా శెట్టి మధ్య భారీ వాగ్వివాదం జరిగింది. ఇంటి సభ్యులంతా శోభా శెట్టి టాప్ 5 లో ఉంటుంది అని చెప్పగా అర్జున్ ఒక్కడు అందుకు ఒప్పుకోలేదు.
ఈమె టాప్ 7 అంటూ అర్జున్ శోభా గురించి చెప్పాడు.. ముందు నుండి శోభాకు లక్ కలిసి వచ్చి హౌస్ లో నెట్టుకొస్తోంది తప్ప ఆమె చేసింది ఏమీ లేదు అన్నట్టు మాట్లాడాడు. అర్జున్ నోరు జారీ మాట్లాడడం శోభాకు మింగుడు పడలేదు.. దీంతో నా కష్టం ఏమీ లేదా కేవలం లక్ అంటూ తీసిపారేసావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే నెటిజెన్స్ మాత్రం అర్జున్ మాటల్లో నిజం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.