CM Revanth Reddy: కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం…సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ: ఏ కొలమానం లేకుండా పథకాలు అమలు చేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైవే లకు రైతుబంధు నిధులు వెళ్లాయని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలు పేదలకే వర్తించాలని రేషన్ కార్డు నిబంధన పెట్టామని సీఎం తెలిపారు.
ఏ కొలమానం లేకుండా ఇస్తే కోటీశ్వరులు కూడా దరఖాస్తులు చేసుకుంటారని ఆయన తెలిపారు. లబ్ధిదారుల గుర్తింపు ని రం తరం కొనసాగుతుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి మళ్లీ లబ్ధిదారులను చేరుస్తామని సీఎం వెల్లడించారు.