SOT Police Raid: ర్యాడిసన్ బ్ల్యూ హోటల్ పై SOT పోలీసుల దాడి.
సైబరాబాద్:- ర్యాడిసన్ బ్ల్యూ హోటల్ పై SOT పోలీసులతో దాడి చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. అ క్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం రావడం తో సెర్చ్ చేశామన్నారు. అప్పటికే హోటల్ నుండి నిందితులు పరారు అయ్యారని ఆయన తెలిపారు. కొంత సమాచారం తో ర్యాడిసన్ డైరెక్టర్ వివేకానంద ఇంటికి వెళ్ళామని వివేకానంద మం జీర గ్రూప్ కి డైరెక్టర్ గా ఉన్నా డ న్నారు.
ఇంటికి వెళ్లిన సమయం లో పోలీసులకు విచారణకు సహకరించకుండా కొంత ఇబ్బం ది పెట్టారని సీపీ తెలిపారు. మంజీర గ్రూప్స్ డైరెక్టర్ వివేకానంద ను అదుపులోకి తీసుకొని డ్రగ్స్ టెస్ట్ చేశాము వి వేకానంద తోపాటు నిర్భయ్ ,కేదార్ కు పాజిటీవ్ వచ్చిందన్నారు. వివేక్ కు యూరిన్ టెస్ట్ చేయిం చాము, కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చిందన్నారు.
మొత్తం ఈ పార్టీ లో 10 మంది ఉన్నట్లు గుర్తించామని ర్యాడిసన్ హోటల్ లో గతంలో పార్టీలు జరి గిన ట్లు గు ర్తిం చామన్నారు. సయ్యద్ అబ్బాస్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించామని వివేకా నం ద, నిర్భయ్ , కేదార్ పై 121b 27, NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని తెలిపారు. డ్రగ్స్ ద్వారా సంపాదించిన ఆస్తులు ను కూడా మేము అటాచ్ చేస్తున్నామని సీపీ తెలిపారు.