GAS-Subsidy: రూ.500 కే గ్యాస్…మొత్తం చెల్లిస్తే సబ్సిడీ ఖాతాల్లో జమ అవుతుంది..!
తెలంగాణ: రేపటి నుంచి ప్రభుత్వం 500 కి గ్యాస్ సిలిండర్ను అందించనుంది. నేడు ఆయిల్ కంపెనీలకు అర్హుల జాబితాను సమర్పించనుంది. అయితే వినియోగదారులు గతంలో మాదిరి సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లిస్తే 500 రూపాయలు పోను మిగతా ప్రత్యక్ష నగదు బదిలీ చేయనుంది. ఉదాహరణకు సిలిండర్ కు 955 రూపాయలు వినియోగదారుడు చెల్లించాల్సి న రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.40 పోను మిగతా రూ. 415 ను ప్రభుత్వం ఖాతాలో జమ చేస్తుంది.