Modi inaugurated: దేశంలో అతి పొడవైన కేబుల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ.

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాతి పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆదివారం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆ యన ప్రారంభించారు. వీటిలో ముఖ్యమైన ప్రాజెక్టు సుదర్శన్ సేతు ఒకటి. గుజరాత్ లోని ద్వారకలో.. దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెనే ఈ సుదర్శన్ సేతు.

ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. దీనికి ముందు ప్రధాని మోడీ ద్వారక ఆలయంలో పూజలు నిర్వహించారు. దేశంలో నే అత్యంత పొడవైన తీగల వంతెన నిర్మాణానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.

ఈ తీగల వంతెన కోసం ఎంతో మంది నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు పనిచేశారు.. ఈ తీగల వంతెనను కేంద్రప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకొని నిర్మించింది. నేడు ప్రధాని నరేంద్రమోడీ ఈ తీగల వంతెనను జాతికి అంకితం చేయడం తో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TAGS