Rudra Santhosh: కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ ని ఢీకొట్టేది రుద్ర సంతోష్?
రుద్ర సంతోష్ కుమార్ ఈ పేరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక సెన్సేషన్ గా మారింది. దశాబ్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారా లలో కీలకంగా పనిచేస్తూ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వార్ రూం ఇంచార్జిగా తీవ్ర కృషి చేసిన రుద్ర సంతోష్ ప్రత్యక్ష రాజకీయల్లోకి ఎంట్రీ ఇస్తుండడం సంచలనంగా మారింది..
కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి రుద్ర సంతోష్ పేరు అధిష్టానం పరీశీలనలో ఉందని తేలడంతో ఇప్పుడు అందరి చూపు అయనపైనే పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అనునయుడిగా, కరీంనగర్ జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలు, నాయకులకు ఆప్తుడిగా ఉన్న రుద్ర సంతోష్ పార్టీలోని అందరు సీనియర్ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు..
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో జతకట్టి వివిధ సమస్యలను వివరించి వారి మనసు గెలుచుకున్నారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే గారు & ఏఐసిసి పెద్దల ప్రత్యేక చొరవతో ఏఐసీసీ OBC జాతీయ కో-ఆర్డినేటర్ గా ఎన్నికైన రుద్ర సంతోష్ అధిష్టానం ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ టికెట్ దాదాపు పొందే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తోంది..BRS నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి రుద్ర సంతోష్ కుమార్ దాదాపు బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది..
పార్లమెంట్ ఎన్నికలు దేశానికి సంబంధించినవి కాబట్టి లోకల్ పార్టీ అయిన BRS పార్టీని ప్రజలు లైట్ తీసుకుంటున్నారు..దీంతో ప్రధాన పోటీ రుద్ర సంతోష్, బండి సంజయ్ మధ్యే ఉండనుంది.. ముల్లుని ముల్లుతోనే తీయాలనే కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో గత మూడు పర్యాయ ల నుండి బిసి టికెట్ కావడం, బీసీ సామాజికవర్గానికి చెందిన వారు కావడం, కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ విధానాలు,
క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా, కార్యకర్తలతో సామా న్యుడిగా కలిసిపోయే వ్యక్తిత్వం & అనుబంధం, పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం, ఉద్యమ కాలం నుండి జిల్లా నలుమూలల ఉన్న అశేష అభిమాన గణం రుద్ర సంతోష్ కు కలిసి వచ్చే అంశాలు..పార్టీ అంతర్గత సర్వేలో కూడా ముందుండటం, విషయం పరిజ్ఞానం, సబ్జెక్టు పరంగా చూసినా, యువతలో ఇమేజ్ పరంగా చూసినా, సామాజిక వర్గం పరంగా చూసినా బండి సంజయ్ ని ఢీ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి రుద్ర సంతోష్ అయితేనే కరెక్ట్ అని జిల్లా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.