Center Neglects Medaram: మేడారం జాతరపై కేంద్రం నిర్లక్ష్యం…సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ: దక్షిణ కుంభమేళా, మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించడం సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ఇది గిరిజనుల ను అవమానించడమే తప్ప మరొకటి కాదన్నారు.
మేడారంలో సమ్మక్క- సారలమ్మల ను దర్శించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గిరిజనులు అంటే కేంద్రానికి చిన్నచూపు చూ స్తుందని మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తే మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతి పెద్ద జాతర మేడారం జాతర అని ఇంత ప్రాముఖ్యత కలిగిన ఈ జాతరను కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేయడం తగదన్నారు. తెలంగాణలో ఉన్న బిజెపి నేతలే జాతీయ హోదా ఇవ్వడం కుదరదని చెప్పడం చూస్తే వారికి తెలంగాణ పై ఎంత ప్రేమ ఉందో మనకు అర్థం అవుతుందన్నారు.