IAS Transfers: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.

తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కు నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఆయన స్థానంలో మిక్కి లినేని మను చౌదరిని నియమించింది. జనగామ కలెక్టర్గా రిజ్వాన్ భాష షేక్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యకు అదరపు బాధ్యతలు అప్పగించింది. జనగామ కలెక్టర్ శివలింగయ్యను జిఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పలు ఐఏఎస్ అధికారులను మారుస్తూ నిర్ణయం తీసు కుంటుంది. గతంలో ఉన్న అధికా రులను ఇతర శాఖల కు బదిలీ చేసి వారి స్థానంలో వేరే అధికారులను నియమిస్తూ ఉంది.  ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలి అంటే అధికారులు చాలా చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. పరిపాలన పరంగా అన్ని సౌవ్యంగా జరగాలి అంటే అనుకూలంగా ఉన్న అధికారులు ఉండటం ఎంతో అవసరం.  సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు తమకు నచ్చిన అధికారులను మార్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది.

TAGS