CM Revanth: మార్చి 2న 6 వేల ఉద్యోగాల భర్తీ.. సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే 25వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ  చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మార్చి 2న 6 వేల పై చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీకి కట్టుబడి ఉ న్నామని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

మెత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ తమ పరిపాలనను కొనసాగిస్తుంది.  రాష్ట్రంలో ఇప్పటి వరకు యువతకు ఉఫాధి లేక ఇబ్బందులు పడ్డారు.. కొత్త నోటిఫికేషన్ లు లేక చాలా ఇబ్బందులు పడ్డారు.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి కల్పించేందకు ప్రణాళికను సిద్దం చేసుకుంటూ ముందుకు వెళ్తుంది.  వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతుండటంతో రాష్ట్రంలోని నిరుద్యో గులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TAGS