Chandrababu Jail Episode : ‘చంద్రబాబు జైలు ఎపిసోడ్’ను జనాలు మరిచిపోలేదు సజ్జల గారూ!

Chandrababu Jail Episode

Chandrababu Jail Episode, Sajjala

Chandrababu Jail Episode : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసి దాదాపు రెండు నెలలు జైల్లో ఉంచి ఆయన ఆరోగ్యానికి పెను ముప్పు తెచ్చిన జగన్ రెడ్డి తీరును ప్రజలు మరిచిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో ఆయనకు ఇప్పుడు పార్టీ క్యాడర్ గుర్తుకు వచ్చారు. వారిని పార్టీ ఆఫీస్ కు పిలిచి మరీ భోజనాలు పెట్టి.. ప్రజల చేత రెండు బటన్లు నొక్కించాలని చెబుతున్నారు. ఈక్రమంలో జగన్ రెడ్డి చేసిన నిర్వాకాలను ప్రజలు మరిచిపోయారని..వాటి గురించి ఆందోళన వద్దన్నట్లుగా ఆయన చెప్పడం పార్టీ కార్యకర్తలను కూడా ఆశ్చర్యపరిచింది.

చంద్రబాబు జైలుకు వెళ్లారు..బెయిల్ పై వచ్చారని జనం మర్చిపోయారు. రోగాలు ఉన్నాయని జైలు నుంచి బెయిల్ పై వచ్చిన చంద్రబాబు..ఈ రోజు యువకుడిలా ఊళ్లలో తిరుగుతున్నారని ఆక్రోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. కేసులపై మాట్లాడవద్దని సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకుంది ప్రభుత్వం. ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరగదని ఆయన అనుకుంటే అంతకంటే అమాయకత్వం ఉండదు. జగన్ రెడ్డి చేసిన ప్రతీ నిర్వాకంపై ప్రజల్లో చర్చ ఉంటుంది.

జగన్ రెడ్డి సైకోతత్వానికి తగ్గట్లుగా టీడీపీ నేతలపై చేసిన ప్రతీ దాష్టీకంపై ఎన్నికల సమయంలో చర్చ జరుగుతుంది. అవేవీ గుర్తుండవు కాబట్టి ప్రజలు  వాటిని గుర్తుంచుకోని ఓట్లు వేయరని చెబుతున్నారు. అంతేకాదు మైనార్టీలకు గత ప్రభుత్వం చేసేవి కూడా చేయబోమని ఆయన చెబుతున్నారు. షాదీ తోఫా నిబంధనల మార్పు చేయడానికి కూడా జగన్ అంగీకారం చెప్పలేదు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మహిళలకు ఉచిత బస్సు, షాదీ తోఫా నిబంధన సడలింపు ఇవ్వాలని జగన్ అనుకోవడం లేదని అంటున్నారు. నొక్కుతున్న బటన్లకు డబ్బులు పడడం లేదని ఐదేళ్లుగా పార్టీ క్యాడర్ ను పట్టించుకోవడం లేదని ఎవరన్నా చెబితే సజ్జల వినే పరిస్థితిలో కూడా లేరు.

TAGS