Virat-Anushka Emotional : వీడియో ఆఫ్ ది డే : విరాట్-అనుష్క ఏమోషనల్ ముద్దులు.. వైరల్ వీడియో
Virat-Anushka Emotional : ఇండియాలో క్యూటెస్ట్ కపుల్ లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో కనిపించేది విరాట్ కొహ్లీ-అనుష్క శర్మ. ఒకరికి ఒకరు అన్ని వేళలో తోడుంటారు. అనుష్క శర్మ సపోర్ట్ తో విరాట్ ప్రపంచంలోనే మేటి బ్యాట్స్ మన్ గా మారాడు. అనుష్కను కొహ్లీ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వివాహం దగ్గరి నుంచి ఈ జంట ఆదర్శంగా నిలుస్తూ వస్తుంది. ప్రతీ విషయంలో విరాట్ ను దగ్గరుండి చూసుకుంటుంది అనుష్క శర్మ.
గతంలో సచిన్-అంజలి అంటే క్రికెటర్ జంటల్లో క్యూట్ గా కనిపించేవారు. గాడ్ ఆఫ్ క్రికెట్ గా సచిన్ ఎదిగేందుకు అంజలి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఆయన లైఫ్ లో ప్రతీ అంశంలో పక్కనే ఉంటూ ఆనందంలో దు:ఖంలో తోడై ఉండేది. కుటుంబం, బయటి నుంచి వచ్చే ఏ విషయాలను సచిన్ వరకు రాకుండా చూసుకునేది అంజలి అందుకే సచిన్ తక్కువ కాలంలో గాడ్ ఆఫ్ క్రికెట్ గా మారాడు.
ప్రస్తుతం అనుష్క కూడా విరాట్ ను అలాగే చూసుకుంటుంది. నిన్న (నవంబర్ 15) న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మ్యాచ్ జరగగా.. విరాట్ కొహ్లీ సెంచరీ కొట్టాడు. ఈ సెంచరీతో ప్రపంచంలోని సచిన్ పేరుపై ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ నుంచి సచిన్ తన భార్య అనుష్క శర్మకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా.. అనుష్క శర్మ కూడా దానికి స్పందించి రిప్లయ్ గా ఫ్లయింగ్ కిస్ చేసింది.
ఈ వీడియోను సచిన్ కూతురు సారా టెండుల్కర్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా అనుష్క శర్మను పొగుడుతున్న వారు లేకపోలేదు.
Moment of The Day ?pic.twitter.com/okjSJcarwW
— Sara Tendulkar (@SaraTendulkar__) November 15, 2023